హైదరాబాద్, మే17 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాల్లోని మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలని, అందుకోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీహబ్ నిర్వహించిన వుమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి అనంతరం మాట్లాడుతూ మహిళాశక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు.
స్వయంసహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచుకోవాలని, వారిని ప్రోత్సహించాలని కోరారు. అనంతరం ఆర్థిక నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.