హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అడిగితే ప్రభుత్వానికి అవసరమైన సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జానారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ఆయన ప్రభుత్వానికి సహకరించాలని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
జానారెడ్డి మాట్లాడుతూ.. కొత్త సర్కారుకు సహకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు. ప్రజాభిమానం చూరగొనేలా పని చేయాలని సూచించానని చెప్పారు. తాను గతంలో పార్లమెంట్‌కు పోటీ చేస్తానని చెప్పానని, అధిష్ఠానం అదేశిస్తే ఆలోచిస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దవాఖానలో ఉండటం బాధాకరమని, తాను వెళ్లినప్పుడు ఆయన నిద్రలో ఉన్నారని, కేటీఆర్, హరీశ్‌రావును కలిసినట్టు జానా తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.