గజ్వేల్, ములుగు, డిసెంబర్ 2: తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణ శక్తిగా వెలుగొందుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్య క్తంచేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మం డలం, బండతిమ్మాపూర్‌లో ఏర్పాటుచేసిన హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ కంపెనీని సోమవారం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రబాకర్, కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునికంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దిన ఈ పరిశ్రమ ఎఫ్ఎమ్సీజీ కంపెనీలలో ఓ మైలురాయిగా నిలువనుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎల్సీ కూర రఘోత్తంరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, హెచ్సీసీబి సీఈవో జువాన్ పాబ్లో రోడ్రిగ్స్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రూ. 2091కోట్లతో పరిశ్రమ ఏర్పాటు
ములుగు మండలం బండతిమ్మాపూర్‌లో టీఎస్ఐపాస్ సేకరించిన 49 ఎకరాల్లో రూ.2091 కోట్లతో పరిశ్రమను ఏర్పాటుచేశారు. పరిశ్రమలో వెయ్యి మం దికి ఉపాధి అవకాశాలను కల్పించింది.