హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్-2047కు అనుగుణంగా అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ)ఏర్పాటు ప్రక్రియ ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సచివాలయం లో ఏటీసీల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు దశల్లో 11 ఏటీసీలను అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు సీఎం రేవంత్రెడ్డి అధికారులకు వివరించారు.
ఇప్పటికే రెండు దశల్లో 49ఏటీసీలు అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీ ఏర్పాటుచేయాలని, అందుకు అవసరమైన స్థల కేటాయింపు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. గిగ్ వర్కర్స్కు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు ప్రతిపాదించిన ప్రత్యేక పాలసీని అధికారులు సీఎంకు వివరించారు. ఈ పాలసీలో భా గంగా గిగ్వర్కర్లకు ప్రత్యేక సంక్షేమబో ర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిథ్యం వహించేలా ప్రతిపాదించారు.