దామరచర్ల, జనవరి 25: కేసీఆర్ కలల సౌధం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఏర్పాటు చేసిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ లక్ష్యాన్ని చేరుకున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30వేల కోట్లతో ఏర్పాటు చేసిన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో మొదటగా రెండో యూనిట్ పని ప్రారంభించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పనులు పూర్తిచేసుకొన్న రెండో యూనిట్ కొన్ని పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. నిరుడు డిసెంబర్ 7న సీఎం రేవంత్‌రెడ్డి రెండో యూనిట్‌ను ప్రారంభించారు.
శనివారం రెండో యూనిట్ నుంచి 811.9 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 807.14 యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. పవర్‌ప్లాంట్‌లోని మిగతా నాలుగు యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నదని సీఈ సమ్మయ్య తెలిపారు.