హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ప్రజలకు విస్తృత సేవలు అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని, హైడ్రా వ్యవస్థాగత ని ర్మాణం, విధి విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. హైడ్రా ఏర్పాటు, విధివిధానాలపై శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలతో సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పనిచేసేలా ఉండాలని చెప్పారు. ఇప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని పునర్వవస్థీకరించాలని ఆదేశించారు. కొత్త విభాగంలో ఏస్థాయి అధికారులుండాలి? ఎంత మంది సిబ్బంది ఉండాలి? ఏ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి..
జీహెచ్ఎంసీతోపాటు హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు వరకు 2వేల చదరపు కిలోమీటర్ల పరిదిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సూ చించారు. హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయి ంచే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. అ సెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయా రు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
‘ఓపీఎస్ అమలయ్యే వరకు పోరాటం’
మారేడ్‌పల్లి, జూలై 12: పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) అమలయ్యే వరకు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ పోరాడుతుందని ఆ సంఘం అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్ అన్నారు. ఏఐఆర్ఎఫ్ పిలుపు మేరకు మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సంచాలన్ భవన్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రధాన కార్యాలయం నుంచి సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివా స్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేపడుతామని కేంద్రాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఉదయభాస్క ర్, కోశాధికారి సరోజినీరెడ్డి, జోనల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, డివిజనల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, డివిజనల్ ప్రెసిడెంట్లు వరస్రసాద్, ఖాజాబాబా, జనరల్ సెక్రటరీ రవీందర్, సీసీఎస్ ప్రెసిడెంట్ స్వామి పాల్గొన్నారు.