హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నాంపల్లికి చెందిన ది వ్యాంగురాలు రజనీకి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్‌వోసీఏ)లో కాంట్రాక్ట్ పద్ధతి లో ఉద్యోగం కల్పించింది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం అనంతరం ఆమెకు సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్టు మేనేజర్‌గా ఉద్యో గం కల్పించింది. నెలకు రూ.50 వేల వేతనం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.