Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా, నాలుగు కోట్ల మంది ప్రజలను నడిపించాల్సిన హోదాలో ఉండి, స్ట్రెచర్, మార్చురీ అంటూ మాట్లాడడం దారుణమని సామాన్యుల నుంచి ప్ర ముఖుల వరకు, యువత, పెద్దలు ఖండిస్తున్నారు.
చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమనేతగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సమాజంలో గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న కేసీఆర్‌ను ఉద్దేశించి కీడును కోరుకుంటూ వ్యాఖ్యలు చేయడం మానవత్వమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రేవంత్‌రెడ్డి వైఖరిని సోషల్ మీడియా వేదికగా తూర్పార పడుతున్నారు. రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల దృశ్యాలను కూడా ఓ చోట చేర్చి, ముందు నుంచీ ఇదే తీరు, ఇక మారదా అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.
కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘నువ్వు సీఎం అని చెప్పుకోవాలంటేనే సిగ్గుపడేలా చేస్తున్నావ్’ అని డీ పేరిట ఉన్న ‘ఎక్స్’ హ్యాండిల్లో ఓ యూజర్ పోస్ట్ చేయగా ‘అతడు సీఎం అనే విషయాన్ని ఎవరైనా రేవంత్‌కు గుర్తుచేయండి’ అని బన్నీ అనే మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు, రేవంత్ మాత్రం సీఎం అయ్యాక నీచమైన మాటలకే పరిమితమయ్యాడు. సీఎంగా కాదు ఓ గూండాలా మాట్లాడుతున్నాడు’ అని తెలంగాణైట్ అనే హ్యాండిల్ నుంచి రఘునాథ్ అనే నెటిజన్ పోస్ట్ చేశాడు.
‘నువ్వు ఇంతకంటే దిగజారవు అనుకున్న ప్రతీసారీ ఇంకా దిగజారుతూనే ఉన్నావ్ అంటూ ‘జెర్సీ’ మూవీలో డైలాగ్‌తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ‘ఛీ.. ఛీ.. ఇంతకన్నా దిగజారవు అనుకున్న ప్రతీసారి యూ ఫ్రూవ్డ్ మీ రాంగ్..’ అంటూ బిజ్జాస్ అనే ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘ఇలాంటి దరిద్రపు సీఎంను నా లైఫ్‌లో చూడలేదు’ అని దుర్గమ్ సదానందమ్ అనే నెటిజన్ వ్యాఖ్యానించగా ‘ఇతను ఉండాల్సింది ఎర్రగడ్డ హాస్పిటల్లో’ అని రవి అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ‘కాంగ్రెస్‌కు ఓటేసినందుకు బాధపడుతున్నా’ అని మింటు అరవింద్ అనే నెటిజన్ వ్యాఖ్యానించగా, రేవంత్‌ది నీచమైన ఆలోచన అంటూ కొండయ్య అనే వ్యక్తి ఆవేదన వ్యక్తంచేశాడు.