హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మోసానికి పర్యాయపదం సబిత అని భట్టి అన్నారు అసెంబ్లీ ప్రజాస్వామికంగా జరుగుతున్నది చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బుధవారం తాను అసెంబ్లీలో ఒక్కమాట కూడా అసభ్యంగా మాట్లాడలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మీడి యా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డిని మోసానికి పర్యాయపదం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబోధించారని తెలిపారు.
సునీతాలక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే తన మీద రెండు కేసులు పెట్టారని, కౌడిపల్లి, నర్సాపూర్‌లో ఇప్పటికీ కేసులున్నాయని వెల్లడించారు. ఆమె అధికార పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ పోస్టు తీసుకొని, ఎమ్మెల్యే అయ్యారని, అయినా ఆ కేసులు తీసేయించలేదని చెప్పారు. సబితాఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్‌లోకి రమ్మన్నారని, తన ఎన్నికల బాధ్యత తీసుకుంటారని చెప్పారని అన్నారు. తర్వాత తనకు అండగా ఉండాల్సింది పోయి, తాను నామినేషన్ వేసినప్పుడు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని తెలిపారు. అందుకే అకల మాటలు నమ్మి తాను మోసపోయానని చెప్పానని వివరణ ఇచ్చారు.