సచివాలయంలో వాస్తు మార్పులు ముమ్మరం?
సీఎం రేవంత్‌రెడ్డి కోసం సచివాలయంలో వాస్తు మార్పులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. తూర్పు వైపున్న ప్రధాన గేటును ఇప్పటికే మూసివేశారు. కాగా.. పశ్చిమం వైపు (వెనుక) గేటు వద్ద మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఈశాన్యం వైపున్న గేటు నుంచి రాకపోకలు సాగించారు.
- ఈశాన్యం గేటు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రాకపోకలు
- వెనుక గేటు వద్ద దుకాణాల తొలిగింపునకు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి కోసం సచివాలయంలో వాస్తు మార్పులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. తూర్పు వైపున్న ప్రధాన గేటును ఇప్పటికే మూసివేశారు. కాగా.. పశ్చిమం వైపు (వెనుక) గేటు వద్ద మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఈశాన్యం వైపున్న గేటు నుంచి రాకపోకలు సాగించారు. ఇకపై ఈ గేటు నుంచి సీఎస్, డీజీపీ, మంత్రులు మాత్రమే రాకపోకలు సాగించాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. మిగతా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు, వీఐపీలను ఆగ్నేయంవైపున్న గేటుకు పరిమితం చేయాలని సూచించినట్టు సమాచారం. సాధారణ ప్రజలు సైతం ఇదే గేటు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇక.. సచివాలయం వెనుక గేటువైపు సీఎం వచ్చే మార్గానికి సమీపంలో ఉన్న చాయ్ దుకాణాలను, ఇతర చిరువ్యాపారుల దుకాణాలను తొలగించాలని ఇప్పటికే అధికారులు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో వారు ప్రత్యామ్నాయ స్థలం వెతుక్కోవాల్సి వస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

