హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రంగరాజన్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాలే యాదయ్య రేవంత్‌కు ఫోన్ చేసి మాట్లాడించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని రేవంత్ తేల్చిచెప్పారు. సీఎం ఆదేశాలతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రంగరాజన్‌ను పరామర్శించారు.
దాడి హేయం: మాజీ ఎంపీ వినోద్‌కుమార్
రంగరాజన్‌పై దాడి హేయమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఖండించారు. రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రంగన్రాజన్పై దాడిని యావత్బ్రాహ్మణ సమాజంపై దాడిగా భావిస్తున్నామని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ అధ్యక్షుడు రమణాచారి పేర్కొన్నారు. దుండగుల దాడి అనాగరికచర్యగా ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్ అభివర్ణించారు.
దాడిని ఖండించిన ప్రముఖులు
రంగరాజన్‌పై దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ రాజుగోపాల్,ఐదుగురి అరెస్ట్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన వారిలో మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.