హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రులతో దోస్తీ చేస్తూ, రాష్ర్టానికి వచ్చి బీజేపీని తిడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి ఆయన శనివారం మా ట్లాడారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకే కేంద్రంపై కాంగ్రెస్ నేతలు నెపం వేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాష్ర్టానికి కేంద్రం సహకరిస్తున్నదని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పడంలో మాస్టర్ డిగ్రీ చేశారని ఎద్దేవాచేశారు.