హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ సైప్లె శాఖకు రావాల్సిన రూ.1,8 91 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రితో వారు భేటీ అయ్యారు.
2014-15లో సరఫరా చేసిన బియ్యం బకాయిలు రూ.1,46 8.94 కోట్లు, 2021-2022 వరకు ఉచిత బియ్యం సరఫరాకు సంబంధించి రూ.343.27 కోట్లు, మరో రూ.79.09 కోట్ల ఇతర బకాయిలను విడుదల చేయాలని కోరారు. సీఎమ్మాఆర్ గడువును నాలుగు నెలల పాటు పొడిగించాలని విన్నవించారు.
రాష్ర్టానికి పీఎం కుసుమ్ కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అనుమతులను పునరుద్ధరించాలని కోరారు. గతంలో 4 వేలకు అనుమతిచ్చి ఇప్పుడు వెయ్యి మెగావాట్లకు కేంద్రం కుదించిందని వివరించారు. రెండు రోజుల పాటు సాగిన సీఎ ం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం రాత్రి వారు హైదరాబాద్‌కు చేరుకున్నారు.