Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సత్య నాదెళ్లను ఆయన నివాసంలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలు.. ఏఐ సిటీలో ఆర్అండ్డీ ఏర్పాటుకు సహకారంపై చర్చించారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చర్చిస్తూ.. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషించాలని సీఎం కోరారు. ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ సీఈవోకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నాలుగు డేటా సెంటర్లు, హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ తదితర అంశాలపై సీఎం చర్చించారు.