CM Revanth | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రారంభించిన సీఎం రేవంత్
CM Revanth | ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం శనివారం అసెంబ్లీ వేదికగా ప్రారంభించారు.
CM Revanth | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం శనివారం అసెంబ్లీ వేదికగా ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్‌ను సీఎం ఆవిష్కరించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతి కుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణ నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

