రామంతాపూర్, సెప్టెంబర్ 1: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజుల బకాయిలను ఎప్పుడిస్తరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు బకాయిలు రూ.8 వేల కోట్లు చెల్లించడానికి సీఎం ఇంత రాద్ధాంతం దేనికి చేస్తున్నారని నిలదీశారు. గతంలో పాలించిన 18 మంది ముఖ్యమంత్రులలో ఎవరు కూడా ఇలాంటి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని చెప్పారు.