CM Revant Reddy | సినీ ప్రముఖుల ఇండ్లపై దాడి చేయడాన్ని సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోనూ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లను ఆదేశిస్తున్నట్లు ఆదివారం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో చేసిన పోస్టులో తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే సంధ్య థియేటర్ ఘటన విషయంలో సంబంధం లేని పోలీసులు స్పందించవద్దని పేర్కొన్నారు. ఇతర సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొందరు ఓయూ జేఏసీ నాయకులు జుబ్లీ హిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.