హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): హిందీని అధికారిక భాషగా గుర్తించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించను న్న గోల్డెన్ జూబ్లీ వేడుకకు సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులకు ఆహ్వానం దక్కలేదు. అథితిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరవ్వాల్సి ఉండగా, ఆయన రాలేకపోతున్నారు.
దీంతో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించారు. వీరితోపాటు విద్యావేత్తలు, భాషా ప్రేమికులు హాజరవుతారు. తెలంగాణలో జరిగే ఈ కార్యక్రమానికి ఇక్కడి సీఎం, మంత్రులకు ఎలాంటి ఆహ్వానం లేకపోవడం గమనార్హం.