హైదరాబాద్, జనవరి 31 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్‌లో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. గోషామహాల్ పోలీస్ గ్రౌండ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి సీఎం భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. రూ.2,700 కోట్లతో ఉస్మానియా దవాఖానను నిర్మించనున్నామని, రెండేండ్లలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. కొత్త దవాఖానలో అన్ని రకాల వసతులు కల్పించనున్నట్టు చెప్పారు.