రంగారెడ్డి : పేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కలేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకమని తెలిపారు. ఎవరి ప్రమేయం లేకుండా,పైరవీ లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు.
కరోనా వల్ల ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ఈ పథకానికి నిధులు ఆపలేదని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్కు మనమంతా అండగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Cm Kcr | శాంతమ్మకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : మంత్రి ఐకే రెడ్డి
యాదాద్రికి పోటెత్తిన భక్తులు..