CM KCR | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో 19న జరగనున్న మెదక్ జిల్లా పర్యటన 23వ తేదీకి వాయిదా పడింది. బుధవారం మెదక్ సమీకృత కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఈ నెల 26న రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవుల వద్ద సీఎం కేసీఆర్ కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం వచ్చే నెల 1న హెచ్ఐసీసీలో జరుగనుండగా, సీఎం కేసీఆర్ పాల్గొని, మొక్కలు నాటుతారు.