జవహర్‌నగర్, సెప్టెంబర్ 16 : ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని 25వ డివిజన్‌కు చెందిన చిన్నారి అనిక దవాఖానలో చికిత్స పొందుతుండగా ఆమె వైద్య ఖర్చులకోసం కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్‌ను సంప్రదించారు.
వెంటనే ఆయన స్పందించి మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయనిధి నుంచి రూ. 1.50లక్షల ఎల్ఓసీని బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలు అనారోగ్యానికి గురికావొద్దని వారి ఆరోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న గొప్ప మానవతావాది సీఎం కేసీఆర్ అని అన్నారు.
టీఆర్ఎస్ హాయంలోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా కొన సాగుతుం దన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడాలేవన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.