వనపర్తి : తెలంగాణ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభకు మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు అప్పులు చేసే పరిస్థితులు తగ్గిపోయాయి. సమయానికి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. పెట్టుబడి కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆదాయం గడించాలన్నారు. కరోనా విపత్తు కారణంగా రైతుల రుణమాఫీ ఆలస్యమయిందని, రుణమాఫీని కచ్చితంగా చేసి తీరుతామన్నారు.