హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే కోటి వృక్షార్చన (ఒక రోజు- కోటి మొకలు) కార్యక్రమానికి అంతా సిద్ధంచేసినట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్లో సీఎం కేసీఆర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే ఆ పార్ను కూడా ఓపెన్చేస్తారని వెల్లడించారు.
గురువారం అరణ్యభవన్‌లో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కోటి వృక్షార్చనను పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని కార్యచరణ ప్రణాళికను సిద్ధంచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు ఈ క్రతువులో భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్ను 360 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిందని మంత్రి అల్లోల చెప్పారు. అర్బన్ లంగ్ స్పేస్‌లో మానసిక ఉల్లాసం, ఆహ్లాదం కోసం సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్.. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల ప్రాంత ప్రజలకు శనివారం నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పారులో వాకింగ్ ట్రా క్, ట్రెకింగ్, రాక్ పెయింటింగ్ సదుపాయాలు కల్పించామని, హరితహారంలో ఇప్పటికి రాష్ట్రంలో 283.82 కోట్ల మొక లు నాటామని మంత్రి పేరొన్నారు.