హైదరాబాద్: తెలంగాణలో రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలని అమ్మవారిని వేడుకున్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పంజాగుట్టలోని దుర్గా భవాన్ని ఆలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల ప్రభుత్వం మళ్లీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్పై ప్రజలు, భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆలయంలో కొలువుదీరిన పంచముఖ లక్ష్మీగణపతికి ఎమ్మెల్యే దానం పూజలు చేశారు. బుధవారం లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి మల్లాది ప్రసాద్ గారు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు.