CM KCR | హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండది. వంద శాతం చర్యలు ఉంటాయి. పీకి అవతల పడేస్తాం. వాళ్ల ఖర్మ వారు పడుతారని కేసీఆర్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రావణమాసం.. ఇవాళ మంచి ముహుర్తం. ధనుర్ లగ్నంలో పండితులు, వేద పండితులు నిర్ణయించినటువంటి కరెక్ట్‌గా 2:38 తర్వాత అంటే.. అదే ప్రకారం ఆ సమయం తర్వాత జాబితా విడుదల చేశాం. తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి, తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఒక్కసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇతర పార్టీలకేమో ఎన్నికలు ఒక పొలిటికల్ గేమ్. కానీ బీఆర్ఎస్ పార్టీకి టాస్క్. ఒక పవిత్ర యజ్ఞంలా, కర్తవ్యంలా ముందుకు తీసుకొని పోతున్నాం. అన్ని సర్దుబాటు చేసుకుని, మంచి అవగాహనతో ఈ నిర్ణయానికి రావడం జరిగింది. భూపాలపల్లిలో వెంకటరమణారెడ్డికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి మద్దతు ఇస్తున్నారు. తాండూరులో కూడా పట్నం మహేందర్ రెడ్డి కూడా రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇలా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకుని, ఈ లిస్ట్ విడుదల చేశామని కేసీఆర్ తెలిపారు.