హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిఫ్ట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత వనపర్తిలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను, అలాగే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.