హనుమకొండ: గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. అధిక వానలతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన ఏటూరునాగారం బయల్దేరారు. అయితే షెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. గూడెపహడ్, ములుగు, గోవిందరావుపేట మీదుగా ఏటూరునాగారం చేరుకుంటారు. దాదాపు నాలుగు గంటలపాటు రోడ్డు మార్గం ద్వారానే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం ఏటూరు నాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో వరద పరిస్థితిపై ప్రజాప్రతినిథులతో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రులు, అధికారులకు సూచనలు చేయనున్నారు.