Watch Live | ఎదురుగా సాగర గౌతముడు.. అదే హుస్సేన్‌సాగర తీరాన అమరుల స్మృతిచిహ్నం.. రెండింటి మధ్య సగర్వంగా తెలంగాణ నూతన సచివాలయం.. దాని పక్కనే సమున్నత శిఖరం. అంబరమంత ఎత్తున నిలబడి.. వెలుగు వైపు వేలు చూపుతూ స్వేచ్ఛా దేవర. పీడితుల సంకెళ్లు తెంచి జాతికి వేకువలా నిలిచిన నీలి సూర్యుడు. ఆయన చేతిలో భారత రాజ్యాంగం. ఆయన కలలుగన్న సమాజం దిశగా తెలంగాణ ఎలా వడివడిగా నడుస్తున్నదో తెలిపే దృశ్యమిది.
ఎవరి రాత దేశ తలరాతను మార్చిందో.. ఏ మహనీయుడి రాజ్యాంగం రాష్ర్టాన్ని ప్రసాదించిందో.. మెజారిటీ ఉన్నోడిదే చెల్లుబాటైన చట్టసభలో ఎవరి రక్షణఛత్రం కింద తెలంగాణ బిల్లు సాకారమైందో.. ఆ సమతామూర్తికి తెలంగాణ ఘన నివాళులర్పించనున్నది. భారత రాజ్యాంగ నిర్మాత భీంరావ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నేడు ఆవిష్కరణకు సిద్ధమైంది. ఆ సమసమాజమూర్తి మహా విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరికాసేపట్లో జాతికి అంకితం చేయనున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాలను మీరు వీక్షించండి..