కొత్త ఏడాది సబ్బండ వర్గాలు సంతోషంతో జీవించాలి : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి సన్నిధిలో తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి ప్రచురించిన శుభకృత్ నామ సంవత్సర నూతన పంచాగాన్ని సోమవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. రెండు సంవత్సరాలుగా కరోనాతో బాధపడుతున్న ప్రజలకు ఇప్పుడు కొంత విముక్తి లభించిందన్నారు.
పండుగల విషయంలో ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలను దృష్టిలో పెట్టుకొని సామరస్య నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. శుభకృత్ నామ సంవత్సరంలో సబ్బండవర్గాలు సంతోషం, మానవతా విలువతో జీవించాలని ఆకాంక్షించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జీవన్‌రెడ్డి, బ్రహ్మణ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Panchangam
- unveiled
- Yadadri
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

