CM KCR | ఆందోళన అవసరం లేదు.. సాధారణంగానే సీఎం కేసీఆర్ ఆరోగ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
హైదరాబాద్, మార్చి12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని వైద్యబృందం కేసీఆర్‌కు పలురకాల పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్, ఎండోసోపీ చేసి అల్సర్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, మందులతో తగ్గిపోతుందని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. వైద్యపరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ వెంట సతీమణి శోభ, మంత్రులు కేటీఆర్, హరీశ్, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

