CM KCR | రాజ్యాంగంలో మార్పులు చేయాలే.. సీఎం కేసీఆర్
CM KCR | రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

CM KCR | భారత రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ పొరపాట్లు చేశాయని మంగళవారం మీడియాతో చెప్పారు. వచ్చే నెలలో జరిగే ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నా బీజేపీ బలం తగ్గుతది. అహంకారం తగ్గుతది అని తెలిపారు.
ఐదు రాష్ర్టాల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ర్టాలు. పంజాబ్లో బీజేపీ సున్నా.. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ బలం తగ్గుతదని కేసీఆర్ అన్నారు. మిగతా మూడు రాష్ర్టాలు చాలా చిన్నవని, వాటి ఎన్నికల ఫలితాలతో పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు.. హక్కులపై కేంద్ర, రాష్ట్ర జాబితాలు, ఉమ్మడి జాబితాలు ఉన్నాయని, కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవన్నారు. సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా లేవన్నారు. కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని అన్నడని కొన్ని కుక్కలు మొరుగుతయి.. కొందరు నేతలు మాట్లాడతారన్నారు. దీనిపై చర్చ జరుగుతది కదా.. అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఏమిటో, బీజేపీ ఏమిటో దేశ ప్రజలు చూశారని సీఎం కేసీఆర్ అన్నారు. భారత్ తెలివైన దేశం.. మౌనంగా ఉండదు.. స్పందించాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్ శక్తి వస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది అర్థం అవుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

