హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో భేటీ కానున్నారు. తాజా జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు వ్యూహాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్టు సమాచారం.