హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరి కాసేపట్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముందుగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫామ్స్ అందజేస్తున్నారు. ప్రస్తుతం 51 బీ ఫామ్‌లు సిద్ధమయ్యాయని, మిగతా బీఫామ్‌లు రెడీ అవుతున్నాయని చెప్పారు. బీఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను సీఎం విడుదల చేయనున్నారు.