హైదరాబాద్ : ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా.. విద్యనేర్పే గురువులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని సీఎం అన్నారు. ‘సమాజాభివృద్ధికి విద్యయే మూలం’ అనే మహనీయుల స్ఫూర్తితో.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యార్థి ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.