H-1B Visa | హెచ్-1బీకి కొత్త రూల్స్.. నేటి నుంచే అమలు
H-1B Visa | హెచ్-1బీ వీసా పిటిషన్లు, గ్రీన్ కార్డ్ దరఖాస్తులు సహా ఇమిగ్రేషన్ ప్రయోజన అభ్యర్థనలపై దరఖాస్తుదారులు ఎలా సంతకం చేయాలన్న విషయమై అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జూలై 10 నుంచి కొత్త నిబంధనలను విధించనున్నది.
H-1B Visa | న్యూఢిల్లీ, జూలై 9 : హెచ్-1బీ వీసా పిటిషన్లు, గ్రీన్ కార్డ్ దరఖాస్తులు సహా ఇమిగ్రేషన్ ప్రయోజన అభ్యర్థనలపై దరఖాస్తుదారులు ఎలా సంతకం చేయాలన్న విషయమై అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జూలై 10 నుంచి కొత్త నిబంధనలను విధించనున్నది.
కొత్త నిబంధనల ప్రకారం చేతిరాతతో చేసిన సంతకాలు లేదా నకలు సంతకాన్ని(రీప్రొడ్యూస్డ్ సిగ్నేచర్) మాత్రమే అధికారులు స్వీకరించనున్నారు. కాపీ పేస్ట్ చేసిన సంతకం, ఆటో జనరేటెడ్ లేదా అనధికార సంతకంతో కూడిన దరఖాస్తును అధికారులు తిరస్కరిస్తారు. చెల్లుబాటు కాని సంతకాలతో కూడిన దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తారు. లోపాలతో కూడిన సంతకాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని యూఎస్సీఐఎస్ కల్పించదు. అయితే తగిన ఫీజు చెల్లింపుతోసహా ఇతర అవసరమైన పత్రాలు ఉంటే సరైన సంతకంతో మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని యూఎస్సీఐఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏ సంతకాలు చెల్లుతాయి?
చేతిరాతతో చేసే సంతకాలు లేదా సిరాతో చేసే సంతకాలు, ఆన్లైన్ దరఖాస్తుల కోసం యూఎస్సీఐఎస్ నిర్దిష్టంగా ఆదేశించే కొన్ని ఎలక్ట్రానిక్ సంతకాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. టైప్ చేసిన పేర్లు, డిజిటల్ సిగ్నేచర్ జెనరేటర్లు, సిగ్నేచర్ స్టాంప్లు, ఆటో పెన్లు లేదా అటార్నీలు చేసే సంతకాలు లేదా ప్రతినిధులు(మైనర్లు లేదా వీలుకాని పెద్దలు వంటి పరిమిత కేసులు మినహాయించి) చేసే సంతకాలు చెల్లుబాటు కావు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

