నీలగిరి, అక్టోబర్ 29: సీమాంధ్రుల పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ సరైన మార్గంలో నడిపించి, కార్మికులకు అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మునుగోడు మండలం కొరటికల్, జోలంవారిగూడెంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్‌తో కలిసి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కొరటికల్‌లో నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 41% పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు అధికారులు అండగా ఉండాలని కోరారు.
stands by