CM KCR | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): జాతీయ రాజకీయాల్లో వేగుచుక్కలా అవతరించిన బీఆర్ఎస్ మరాఠా గడ్డపై నాగ్‌పూర్ వేదికగా పార్టీ విధానాలు, ఆలోచనలను స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం, పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు గురువారం మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ సందర్భంగా దేశంలో వాస్తవ పరిస్థితిని వివరించిన కేసీఆర్, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా జాతీయ రాజకీయాల్లో ఏ మార్పును ఆశిస్తున్నామో ఆ వివరాలను వెల్లడించారు. నాట్ టాక్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్.. లెట్ అజ్ థింక్ ఆఫ్ నెక్ట్స్ ప్రాక్టీసెస్ అంటూ కొత్త దిశానిర్దేశం చేశారు. పలు డాక్యుమెంట్లను విలేకరులకు అందజేశారు. ఆయా డాక్యుమెంట్లలో వివరాలిలా ఉన్నాయి.
సంసరణల ఎజెండా:
దేశాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన నిర్మాణాత్మక మార్పులు
1. ఆర్థిక సంసరణలు
విదేశాల నుంచి ఎఫ్‌డీఐలను వరద పారించేందుకు కొత్త విధానాలు తీసుకురావాలి. చైనాలో చేసిన విధంగా సెజ్‌లు అభివృద్ధి చేయాలి. స్థిరమైన పన్ను విధానం, చట్టాలలో ఎలాంటి మార్పులు, పునరాలోచనలు చేయకూడదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగుపర్చాలి. విదేశీ పెట్టుబడులపై పరిమితులను తొలగించాలి. వృద్ధికి ఆటంకం కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉదాహరణకు నౌకాశ్రయాలలో కంటైనర్ నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుపర్చాలి. టర్న్-అరౌండ్ సమయాన్ని మెరుగుపర్చడం ద్వారా కొన్ని అడ్డంకులు తొలగించుకోవచ్చు. ఎన్హెచ్ఎస్లో సగటు వేగాన్ని మరింతగా మెరుగుపర్చాలి. రైలులో సరుకు రవాణా, కస్టమ్స్ క్లియరెన్స్ పొందడానికి వెచ్చించే సమయాన్ని పూర్తిగా తగ్గించాలి.
2. రాజ్యాంగ సంసరణలు
రాష్ట్రాలకు మరిన్ని నిధుల పంపిణీ: రాష్ట్ర జాబితా సబ్జెక్టుల నిధులను కేంద్రం నుంచి రాష్ట్రాలు 41 శాతానికి బదులుగా 50 శాతం నిధులు పొందాలి. ఇందుకు శాశ్వత ఆర్థిక సంఘం అవసరం. కేంద్ర ఫైనాన్స్‌ను అంచనా వేయడం, పరపతి పొందడం కోసం శాశ్వత ఆర్థిక సంఘం చొరవ తీసుకోవాలి. అలాగే రాష్ట్రాల ఫైనాన్స్ మదింపు, పరపతి కోసం ఈ ఆర్థిక సంఘం కృషి చేయాలి.
3. ఎన్నికల సంసరణలు
ఎన్నుకున్న ప్రభుత్వ కాలవ్యవధి గురించి చర్చించాలి. అన్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికలను ఏకకాలంలో అంటే 6 నెలల వ్యవధిలో నిర్వహించాలి. ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం పడిపోతే, తదుపరి బ్యాలెన్స్ పీరియడ్ కోసం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి.
4. న్యాయ సంసరణలు:
న్యాయవ్యవస్థలో సంసరణలు తేవాలి.
5. పరిపాలనా, పాలనా సంసరణలు:
మార్పుకోసం కార్యాచరణ – ఎజెండా
1. వ్యవసాయం
వ్యవసాయంలో దిగుబడి తక్కువగా ఉన్నది. ఫలితంగా లాభాలు తక్కువగా వస్తున్నాయి. రైతులు, వినియోగదారుల ధరలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. రైతులకు వారి కుటుంబాలను పోషించడానికి సరిపడా ఆదాయం కూడా రావడం లేదు. పంటల బీమా, రుణమాఫీ సాయం చేయలేదు.
2. నీటిపారుదల
దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నది. 5.5 కోట్ల ఎకరాల భూమి మాత్రమే కాలువలు, నీటిపారుదల కింద ఉన్నది.
3. తాగునీరు
4. ఆరోగ్యం
5. పర్యావరణం
దేశంలో అడవులు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. ప్రస్తుతం పచ్చదనం 21.34 శాతం మాత్రమే ఉన్నది. దీన్ని 33 నుంచి 40 శాతానికి పెంచాలి.
6. బొగ్గు ఉత్పత్తి
దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 3 ప్రధాన బొగ్గు క్షేత్రాలను చాలా సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఉత్తర కరణ్‌పురా (జార్ఖండ్), మాండ్-రాయ్‌ఘర్ (ఛత్తీస్‌గఢ్), వ్యాలీ (ఒడిశా) బొగ్గు క్షేత్రాలకు నేటికీ రైల్ కనెక్టివిటీ లేదు. రైల్వే లైన్ నిర్మిస్తే కోలిండియా 300 ఎమ్‌టీల బొగ్గును ఉత్పత్తి చేయగలదు.