KCR Press Meet – తెలంగాణ దళితులను ఆర్థిక ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథకంపై వస్తున్న తప్పుడు కథనాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. దళిత బంధు పథకాన్ని వందకు వంద శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. మేము ఇదివరకే స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు కూడా చెబుతున్నాం. సోషల్ మీడియా ఆ పథకంపై ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.. అంటూ రాష్ట్ర బీజేపీ నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత, గిరిజనుల కోసం వచ్చిన ఆట్రాసిటీ చట్టాన్ని పట్టుకొని లొట్టపీస్ చట్టం అంటడు ఓ నేత. మీరు 7 ఏళ్లలో ఈ దేశానికి చేసిన పని ఏంటి. ఎవరికి చేశారు. దళితులకు చేశారా.. ఎస్టీలకు చేశారా.. బీసీలకు చేశారా? నిరుద్యోగులకు చేశారా? భావోద్వేగాలు రెచ్చగొట్టడమేనా మీ రాజకీయం. దేశాన్ని నాశనం పట్టించారు. దేశ జీడీపీ మట్టికలిసిపోయింది. అడ్డగోలుగా టాక్స్లు పెంచారు. ప్రభుత్వ రంగ సంస్థలను తీసేసి ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు. ఎందుకు బ్రహ్మాండమైన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్నిరకాల ఒత్తిడి చేస్తున్నారు. బావి దగ్గర మీటర్లు పెట్టాలంటూ రైతులను ఒత్తిడి చేస్తున్నరు. లేకపోతే ఆర్ఈసీ ద్వారా, పీఎఫ్సీ ద్వారా వచ్చే రుణాలు రాకుండా చేస్తమంటూ బెదిరిస్తున్నరు. ఇవన్నీ వాస్తవాలు. ఇక నుంచి ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంట పడుతం.. బీజేపీ వెంట పడుతం. ఇక్కడి సమస్యలకు ఎవరు సమాధానం చెప్పాలో ఖచ్చితంగా అడుగుతం. ట్రైబల్ యూనివర్సిటీ నో.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నో.. కోచ్ ఫ్యాక్టరీ నో.. ఒక్క పని అయినా చేశారా? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఏం చేస్తున్నరు. తెలంగాణకు రూపాయి ఇచ్చారా? మిషన్ కాకతీయ బ్రహ్మాండమైన పథకం అని నీతి ఆయోగ్ చెప్పింది. 24 వేల కోట్లు ఇవ్వమంటే 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథకు కూడా రూపాయి ఇవ్వలేదు.. అంటూ కేసీఆర్ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR : పెట్రోల్, డీజిల్పై కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించిన సీఎం కేసీఆర్
CM KCR Press meet | కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్..
CM KCR : ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట.. ఎవరిని నమ్మాలి : సీఎం కేసీఆర్
కేంద్రం వరి సాగు లేదని అవమానించింది : సీఎం కేసీఆర్
CM KCR : బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పిన ఆర్బీఐ : కేసీఆర్
cm kcr | బండి సంజయ్ నన్ను జైలుకు పంపుతవా..? అంత బలుపా? : సీఎం కేసీఆర్