10 లక్షలతో పాటు అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించడమే దళిత బంధు ఉద్దేశం: సీఎం కేసీఆర్
ప్రతి రంగంలో దళితులకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే దళిత బంధు ముఖ్య ఉద్దేశం. విదేశీ విద్యలో కూడా పేద విద్యార్థులకు 20 లక్షలు
యాదాద్రి భువనగిరి : తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం అద్భుతమైనదని.. ఆ పథకం కింద దళితులకు కేవలం రూ.10 లక్షలు ఇవ్వడమే కాదు.. ఇదివరకు దళితులకు లేని ఎన్నో రిజర్వేషన్లను ఈ స్కీమ్ ద్వారా కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఇదివరకు దళితులకు రాని ఎన్నో ఫెసిలిటీలను ఇప్పుడు అందిస్తున్నామని తెలిపారు.
ప్రతి రంగంలో దళితులకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే దళిత బంధు ముఖ్య ఉద్దేశం. విదేశీ విద్యలో కూడా పేద విద్యార్థులకు 20 లక్షలు ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాం. అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. దేశం కిందికి పోతాఉంది. రాష్ట్రం మాత్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ఉద్యోగులకు సంబంధించి చిన్నాచితక సమస్యలు వస్తాయి. అవి కామన్. 69లో జరిగింది ముల్కీ రూల్స్ పోరాటమే. కేంద్ర ప్రభుత్వం ఏడిపించినా.. 95 శాతం రిజర్వేషన్లు లోకల్స్ కోసమే కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొచ్చా. 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే. గెజిటల్ పోస్టులు కూడా మల్టీ జోనల్ పోస్టులుగా తీసుకొచ్చాం. అవి కూడా 95 శాతం తెలంగాణ బిడ్డలకే వస్తాయి. ఇవి తెలియక కొందరు పిచ్చిగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ మారాలి. ఉద్యోగ సంఘాల నాయకులను కోరేది కూడా అదే. సర్వీస్ నిబంధనలు సరళీకరించాలి. రిటైర్ అయ్యేనాటికి సర్వీస్ రూల్స్ సులభంగా ఉండాలి.. అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

