CM KCR Press meet | ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రగతి భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రైతాంగాన్ని బీజేపీ మోసం చేస్తోందన్నారు. తెలంగాణలో పండించే వరిధాన్యాన్ని పూర్తిగా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో వరిధాన్యం కొనుగోలుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎంపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.
రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు పురాణం చెబుతున్నాడు. దమ్ముంటే వెళ్లి కేంద్రం దగ్గర్నుంచి ఆర్డర్స్ తీసుకురా. వరిధాన్యం వేయాలని చెప్పడం కాదు.. నువ్వు ఆర్డర్స్ తీసుకొస్తే వెంటనే 70 నుంచి 80 లక్షల ఎకరాల్లో వరి పంట వేయిస్తం. కేంద్రం వడ్లు తీసుకుంటా అంటే కేసీఆర్ వద్దంటున్నడా. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నవు. నువ్వు కొంట అన్నవు కదా.. నీ మెడలు వంచడం కాదు విరుచుతం. నీ పార్టీ అధికారంలో ఉంది కదా.. తీసుకొని రా.. ఓవైపున పంటల మార్పిడి చేయించండి అని రాతపూర్వకంగా ఇస్తరు. మరోవైపు వరిధాన్యం వేయమంటరు. ఢిల్లీ బీజేపీ వరి ధాన్యం వేయొద్దంటది.. సిల్లీ బీజేపీ వరి ధాన్యం వేయాలంటది. ఏది కరెక్ట్… ఢిల్లీ బీజేపీ కరెక్టా.. సిల్లీ బీజేపీ కరెక్టా.. అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రితో నేను మాట్లాడితే.. ఈసారి వరిధాన్యం వేయించకండి.. అని నాకు రాతపూర్వకంగా లెటర్ ఇచ్చారు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడేమో ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటంతో వెంటనే నేను మళ్లీ కేంద్ర మంత్రితో ఇదే విషయం గురించి మాట్లాడా? దఈంతో.. నేను ఎప్పుడు చెప్పిన.. చెప్పలేదు అన్నడు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాత్రం వరి ధాన్యం వేసుకోండి.. ఎలా వడ్లు కొనరో అని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు.. కావాలంటే మీరు ఇంటలిజెన్స్ ద్వారా ఆయన ఏం మాట్లాడారో తెప్పించుకొని చూడండి అని కూడా చెప్పా.. అని కేసీఆర్ స్పష్టం చేశారు.
మీకు చేతనైతే కేంద్రం మెడలు వచ్చి ఆర్డర్స్ తీసుకురండి. డిసెంబర్ చివరి దాకా వరిధాన్యం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ సిల్లీ బీజేపీ, డిల్లీ బీజేపీ ఆర్డర్స్ ఇస్తదా? కోటిన్నర టన్నుల బాయిల్ రైస్ తీసుకుంటమని చెప్పండి. నేను నిలబడి పొలం చేపిస్త. తెలంగాణ రైతులకు వరి ధాన్యం వేయమని చెబుతా. మీరు ఆర్డర్స్ తీసుకురండి.. అని రాష్ట్ర బీజేపీ నాయకులకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR : పెట్రోల్, డీజిల్పై కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించిన సీఎం కేసీఆర్
CM KCR Press meet | కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్..
CM KCR : ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట.. ఎవరిని నమ్మాలి : సీఎం కేసీఆర్
కేంద్రం వరి సాగు లేదని అవమానించింది : సీఎం కేసీఆర్
CM KCR : బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పిన ఆర్బీఐ : కేసీఆర్
నకిలీ విత్తనాలపై పీడీయాక్ట్ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ