CM KCR | కొత్తగా నిర్మించిన సచివాలయంలో తొలిసారి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం కూలంకంషంగా చర్చించారు. ఇందులో భాగంగా జులై వరకు కరివెన జలాశయంకు నీళ్లు తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని.. పంప్‌హౌస్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై సమీక్షించారు. మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం సూచించారు.
సమీక్షా సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, కాలె యాదయ్య, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, అంజయ్య యాదవ్, ప్రకాశ్ గౌడ్, మహేశ్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హాజరయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే, ఈఎన్సీ మురళీధర్ రావు, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు హమీద్ ఖాన్, ధర్మా, ఎస్ఈలు రంగారెడ్డి, శ్రీనివాస్, విజయ భాస్కర్‌రెడ్డి, చక్రధర్, ఏఎస్ఎన్ రెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్ సూర్య ప్రకాశ్, డీఈ పీఆర్ఎల్ఐఎస్ సయ్యద్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.