సోమవారం 01 జూన్ 2020
Telangana - May 17, 2020 , 13:15:07

సాగునీటిరంగంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

సాగునీటిరంగంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: గోదావరి నదీజలాల సమర్థ వినియోగంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ లాభాలను పొందేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి గోదావరి నదీ పరివాహక జిల్లాల మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, అధికారులు హాజరయ్యారు.


logo