హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి ప్రాజెక్టు పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.