CM KCR | హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. రుతుపవనాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇక జలాశయాల్లో నీటి నిల్వతో పాటు సంబంధిత విషయాలపై మంత్రులు, అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారు.