CM KCR | నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ కొల్లాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో నాగర్‌కర్నూల్ తేజ గార్డెన్స్‌లో లంచ్ చేసి.. కొల్లాపూర్‌కు వెళ్లారు కేసీఆర్. నాగర్‌కర్నూల్‌లో కేసీఆర్‌కు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న స్వాగతం పలికారు.
మరికాసేపట్లో నార్లాపూర్ కంట్రోల్ రూమ్‌లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్ చేస్తారు. సాయంత్రం నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు కొల్లాపూర్‌లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకుంటారు.