హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మంత్రి మాట్లాడారు.
పూలే కన్న కలలు సాకారం చేసే విధంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
పూలే పేరుతోనే బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేసి ఆ వర్గాల వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తన సతీమణి సావిత్రి పూలేని చదివించి, ఆమె ద్వారా మహిళలను విద్యావంతులను చేసిన ఘనత పూలేది అని ప్రశంసించారు.
ఆ మహనీయుడి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. సబ్బండ వర్గాల కోసం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఆయా పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కన్న కలలను సాకారం చేసేది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే అని తెలిపారు.