బీజేపీ వన్నీ తప్పుడు లెక్కలు.. పచ్చి అబద్ధాలని.. త్వరలోనే దేశ భవిష్యత్తు కోసం ఉద్యమిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈదేశంలో ఏం జరగాలి.. ఏ పద్ధతిలో ముందుకు వెళ్లాలి అనేది మేథోమథనంలో తేలుతుంది. కొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సదస్సును నిర్వహించబోతున్నాం. దీన్ని ప్రధాన మంత్రి పదవి కోసమో.. చిల్లర రాజకీయాల కోసమే నేను ఆలోచించడం లేదు. దేశ భవిష్యత్తు కోసం.. ఆలోచిస్తున్నా. ఉన్న వనరులు, వసతులు కూడా వాడుకోలేని పరిస్థితి నుంచి ఈ దేశం బయటపడాలి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది. ఒక ప్రాసెస్ జరిగింది. ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీలో ఒకాయన ముఖ్యమంత్రి అయిండు.. ఇంకొందరు మంత్రులు. ఈ ప్రాసెస్‌లో పదవులు పోటీకాదు. కావాల్సింది దేశం బాగుపడాలి. దేశానికి కొత్త ఎంజెడా సెట్ కావాలి. కొత్త పంథాతో యువకులు పురోగమించాలి. 75 ఏళ్ల తర్వాత భారతదేశం ఆర్థిక పరిస్థితి 40 లక్షల కోట్లు దాటలేదు. సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్లు చెప్పేది అంతా బోగస్. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. జీడీపీ లెక్కలు తప్పు.. అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. అన్నీ గోల్ మాల్ చేస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీతో ఎవరు కలిసి రాలేదు. టీఆర్ఎస్ పుట్టిన తర్వాత కరుడుగట్టిన చంద్రబాబుతో కూడా జై తెలంగాణ అనిపించాం. బీజేపీతో తెలంగాణ అనిపించాం. ఎర్రజెండ పార్టీలతో జై తెలంగాణ అనిపించాం. పడుకున్న కాంగ్రెస్‌ను లేపి కూర్చోబెట్టి జై తెలంగాణ అనిపించినం. పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది ఈ ప్రపంచంలో. ప్రజలు ఒకసారి మేల్కొంటే నాయకులను వాళ్లే నడిపిస్తరు. వాళ్ల లక్ష్యం ఏంటో ప్రజలకు తెలిస్తే వాళ్లే ముందుకు వెళ్తరు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాక ముందు అందరూ అలాగే అన్నరు. పర్ క్యాపిటా విషయంలో కావచ్చు.. ఉపాధిలో కావచ్చు.. వలసలు పోయిన తెలంగాణకు 11 రాష్ట్రాల నుంచి వలసలు వచ్చిన మాట వాస్తవం కాదా. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈరోజు ఉజ్వలమైన తెలంగాణ ఉంది. కరోనా వచ్చి వలస కూలీలు భయపడుతుంటే వాళ్లకు 172 రైళ్లు పెట్టి వాళ్ల రాష్ట్రాలకు పంపించాం. వాళ్లకు 500 రూపాయలు ఇచ్చాం. వాళ్లకు అరటిపండ్లు, అన్నం పెట్టి పంపించాం.
నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 ఏళ్లలో ఏం చేసింది. రేకు డబ్బాలో రాళ్లు వేసి లొడలొడా ఊపడం తప్పితే ఎవరికి మేలు జరిగింది. జీడీపీ తగ్గిపోయింది. ఆకలి రాజ్యం పెరుగుతోంది. లొడలొడ లొల్లా. కూర్చుందామా చర్చకు. నేను రెడీ. ఏం మార్పు తెచ్చారు. దిక్కుమాలిన మత పిచ్చి లేపడం.. ప్రజలకు ప్రజలకు కొట్లాటలు పెట్టడం. సిగ్గు లేకుండా అబద్ధపు ప్రచారాలు చేయడం.
రామానుజులవారి విగ్రహం మోదీ కట్టించాడా. సోషల్ మీడియాలో ఏంటి ఈ అబద్ధపు ప్రచారం. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కడితే.. ఎక్కడో కట్టినం అంటరు. బెంగాల్లో ఎన్నికలు వస్తే గడ్డం పెంచుకొని రవీంద్రనాథ్ ఠాగూర్‌లా మారాలా.. తమిళనాడులో ఎన్నికలు ఉంటే పంచె కట్టాలా.. ఇవేనా మీరు చేసేంది. బట్టలు మార్చుకుంటే దేశానికి కరెంట్ వస్తుందా.? మహారాష్ట్ర సీఎంతో కూడా మాట్లాడా. ఇందులో దాచేదేం లేదు. రేపు ముంబై కూడా వెళ్తున్నా. దేశం కోసం ఎక్కడికైనా వెళ్తా. నేను ఈ దేశానికి సిఫాయిని. కుక్కలకు నేను భయపడను.. దేశం కోసం పోరాడుతా అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.