నల్లగొండ : నార్కట్పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. లింగయ్య తండ్రి చిరుమర్తి నరసింహ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ నరసింహ సంతాప వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. నరసింహ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నివాళులర్పించారు.
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సీఎం కేసీఆర్ పరామర్శించారు. సీఎం వెంట మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర నేతలు ఉన్నారు.@KTRTRS @TelanganaCMO @jagadishTRS @DayakarRao2019 pic.twitter.com/2dLjDpRwW8
— Namasthe Telangana (@ntdailyonline) April 28, 2022