హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్లో డ్రగ్స్ నియంత్రణపై సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, పోలీస్, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ కేసుల్లో దోషులుగా ఎంతటివారు ఉన్నా కఠినంగా శిక్షించాలని సీఎం తెలిపారు.
డ్రగ్స్ నియంత్రణ కోసం వెయ్యి మందితో కూడా నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోలో్ సెల్ పోలీస్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. దీనిపై పోలీస్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో ఈ సెల్ విధులను నిర్వర్తించనుంది. ఇది డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కృషి చేయనుంది.
అలాగే.. డ్రగ్స్‌పై డీజీపీ పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో డ్రగ్స్ నియంత్రణపై కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారుల చిట్టాను పోలీస్ శాఖ తయారు చేసింది. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, విద్యార్థుల పేర్లతో చిట్టాను సిద్ధం చేశారు. డ్రగ్స్‌తో పాటుగా గంజాయి తీసుకున్న వారి వివరాలను పోలీస్ శాఖ పొందుపరిచింది. అలాగే.. డ్రగ్స్‌పై నిరంతర నిఘా కోసం కొత్త యాప్‌ను పోలీస్ శాఖ రూపొందించింది. దోపమ్ యాప్‌లో డ్రగ్స్ క్రయ విక్రయదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. అలాగే.. డ్రగ్స్‌కు సంబంధించిన గత పదేళ్ల డేటాను పోలీస్ శాఖ సిద్ధం చేసింది.